ENGLISH

వాల్తేరు వీర‌య్య అప్ డేట్ వ‌చ్చేసింది!

30 May 2022-13:00 PM

ఆచార్య ఫ్లాప్ తో.. చిరంజీవి సినిమాల‌న్నింటికీ బ్రేక్ ప‌డిపోయింది. ఆచార్య విడుద‌ల త‌ర‌వాత చిరు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని, త‌న సినిమాలు, వాటి క‌థ‌లు, తెర‌కెక్కుతున్న విధానాన్ని పునః ప‌రిశీలించాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లొచ్చాయి.ద ఆనికి త‌గ్గ‌ట్టుగానే చిరంజీవి కూడా షూటింగుల‌కు బ్రేక్ ఇచ్చి, కుటుంబంతో స‌హా విహార యాత్ర‌కు వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచీ చిరు సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు ఏమీ రావ‌డం లేదు. ఎట్ట‌కేల‌కు `వాల్తేరు వీర‌య్య` అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. ఆచార్య విడుద‌ల‌కు ముందు.. హైద‌రాబాద్ లో ఓ కీల‌క‌మైన షెడ్యూల్ సాగింది. ఆ త‌ర‌వాత బ్రేక్ ప‌డింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ మొద‌లెడుతున్నారు. జూన్ ప్ర‌ధ‌మార్థంలో మలేషియాలో కీల‌క సన్నివేశాలు, పాట‌, ఓ ఫైటు తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు సాగుతుంద‌ని, శ్రుతి హాస‌న్ తో పాటు మిగిలిన ప్ర‌ధాన తారాగ‌ణం అంతా చిత్రీక‌క‌ణ‌లో పాలు పంచుకుంటార‌ని తెలుస్తోంది. చిరుని పూర్తి స్థాయి మాస్ పాత్ర‌లో చూపించే సినిమా ఇది. మ‌రో కీల‌క‌మైన పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ALSO READ: 'మేజ‌ర్' టాక్ అదిరిపోయిందిగా!