ENGLISH

అసహనంలో చిరు ఫాన్స్

14 October 2024-13:14 PM

మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మెగా ఫాన్స్ ని నిరాశ పరిచింది. ఆచార్య, భోళా శంకర్ వరుసగా రెండు డిజాస్టర్లు కావటంతో చిరు ఫోకస్ పెట్టి, ఆచి తూచి కథ ఎంచుకున్నారు. అదే విశ్వంభర మూవీ. 'బింబిసార' తో మెప్పించిన వశిష్ట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాతి బరిలో నిలవాల్సి ఉండగా, చెర్రీ కోసం  రేస్ నుంచి తప్పుకున్నారు చిరు. నెక్స్ట్ సమ్మర్ లో రావటానికి సిద్ధం అవుతున్నారు. 
                 

తాజాగా ద‌స‌రా సంధర్భంగా 'విశ్వంభ‌ర‌' టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్‌లో చిరు లుక్‌ సూపర్ గా ఉంది. మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు చిరు. టీజర్ ను చూస్తే ఓ దుష్టశక్తిని అంతం చేయడానికి పుట్టిన కారణజన్ముడి పాత్రలో చిరు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీన్స్ హైలెట్ అయ్యాయి. విశ్వంభర టీజర్ 23 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నెంబర్ 1 గా ట్రెండింగ్‌లో ఉంది. టీజర్ లో డైనోసార్, రెక్కల  గుర్రం    అన్నీ ఉండటంతో ఇదొక మంచి సోషియో ఫాంటసీ చ్చిత్రం అని మరోసారి స్పష్టం అయ్యింది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు చేస్తున్న సోషియో పాంటసీ మూవీ ఇదే కావటం తో ఫాన్స్ మంచి హుషారుగా ఉన్నారు. 


అలరించే అంశాలు ఇన్ని ఉన్నా ఫాన్స్ లో చిన్న అసంతృప్తి నెలకొంది. విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నా విజువల్ ఎఫెక్ట్స్ పై పెదవి విరుసున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవని, చాలా చీప్‌గా ఉన్నాయ‌ని విమర్శలు ఎదురవుతున్నాయి.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ చిన్న సినిమా అయినా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని, మంచి విజువల్ ట్రీట్ ఇవ్వటం వలనే హనుమాన్ భారీ విజయాన్ని సాధించిందని ఆడియన్స్ అభిప్రాయం. ఎలాగూ విశ్వంభర వాయిదా పడింది కాబట్టి విజువల్స్ విషయంలో శ్రద్ద చూపాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఎవెంజర్స్ మూవీ నుంచి కాపీ కొట్టారని నెట్టింట ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.