ENGLISH

Brahmastra: "బ్రహ్మాస్త్ర"లో మెగా ఎట్రాక్షన్

13 June 2022-14:37 PM

రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్‌ ఇండియా ‘‘బ్రహ్మాస్త్ర’ . అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ సినిమాకి.. దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో మెగా ఎట్రాక్షన్ చేరింది. మెగాస్టార్ చింరజీవి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. చిరు వాయిస్ తో ‘‘బ్రహ్మాస్త్ర’ కథ మొదలౌతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం దృవీకరీంచింది.

 

బాలీవుడ్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న చిత్రమిది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుండి పెద్ద సినిమాల జోరు తగ్గింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప.. ఇలా సౌత్ ఇండియన్ సినిమాల హవానే నడిచింది. ఇప్పుడు బాలీవుడ్ ఆశలు ‘‘బ్రహ్మాస్త్ర’ పై వున్నాయి. ఇది గ్రేట్ పాన్ ఇండియా మూవీ అవుతుందని బాలీవుడ్ నమ్మకం వుంది. ఈ చిత్రానికి సౌత్ లో రాజమౌళి సమర్పకుడిగా వుండటం ఇప్పుడు చిరు వాయిస్ కూడా చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ALSO READ: వావ్‌: భోళా శంక‌ర్‌లో నితిన్‌