ENGLISH

చిరు.. మ‌హేష్ చెరో కోటి

20 October 2020-13:30 PM

హైద‌రాబాద్ వ‌ర్షాల‌కు అల్లాడిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా ఆస్తి న‌ష్టం జ‌రిగింది. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వాళ్ల‌ని ఆదుకోవ‌డానికి చిత్ర‌సీమ ఇప్పుడు ముందుకు వ‌స్తోంది. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా చిరంజీవి, మ‌హేష్‌బాబు చెరో కోటి రూపాయ‌లు స‌హాయం అందించారు. నాగార్జున, ఎన్టీఆర్ చెరో 50 లక్ష‌ల విరాళాల్ని ప్ర‌క‌టించారు.

 

త్రివిక్ర‌మ్, హారిని హాసిని సంస్థ‌లు చెరో 10 ల‌క్ష‌లు సాయం అందించాయి. వ‌ర‌ద బాధితుల్ని ఆదుకోవాలంటూ విజ‌య్ ట్వీట్ చేశాడు. త‌న వంతు సాయం కూడా చేసేశాడు. అయితే ఆ సాయం ఎంతో ప్ర‌క‌టించ‌లేదు. బ‌డా హీరోలు ముందుకొచ్చి సాయం అందించ‌డం మంచి ప‌రిణామం. ఇప్పుడు మిగిలిన‌వాళ్లూ... త‌లో చేయి వేస్తే బాగుంటుంది. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి విప‌త్తు జ‌రిగినా సాయం అందించ‌డంలో ముందుంటుంది చిత్ర‌సీమ‌. ఇప్పుడూ అలానే .. ముందుకు వ‌స్తోంది. టాలీవుడ్ కి హైద‌రాబాద్ గుండెకాయ లాంటిది. దాన్ని కాపాడుకోవ‌డం చిత్ర‌సీమ బాధ్య‌త కూడా.

ALSO READ: ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ వ‌దిలేశాడు