ENGLISH

చిరు - త్రివిక్ర‌మ్‌.... గుడ్ న్యూస్ త్వ‌ర‌లో!

08 November 2021-11:48 AM

మెగా అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ చిరంజీవి - త్రివిక్ర‌మ్. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తే చూడాల‌న్న‌ది అంద‌రిఆశ‌. అది త్వ‌ర‌లోనే తీర‌బోతోంది. ఈసినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో రాబోతోంది. అవును.. త్రివిక్ర‌మ్ - చిరు ల కాంబో దాదాపుగా ఖాయ‌మైంది. డీవీవీ దాన‌య్య ఈ చిత్రానికి నిర్మాత‌. ప్ర‌స్తుతం మ‌హేష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్.

 

2022లో ఈ చిత్రం విడుద‌ల అవుతుంది. ఆ వెంట‌నే... త్రివిక్ర‌మ్ చిరు కోసం క‌థ సిద్ధం చేస్తాడు. 2023లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా చిరు చేతిలో ఉన్న సినిమాలు ఒకొక్క‌టిగా పూర్త‌వుతాయి. గాడ్ ఫాద‌ర్‌, వాల్తేరు శీను, భోళా శంక‌ర్ చిత్రాలు చిరు ముగించాలి. ఆచార్య ఇటీవ‌లే పూర్త‌య్యింది. వాల్తేరు శ్రీ‌నుకి ఇటీవ‌ల కొట్టారు. భోళాశంక‌ర్ నీ వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌న్న‌ది ప్లాన్‌. నిజానికి రామ్ చ‌ర‌ణ్ - త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రావాల్సింది. కానీ చ‌ర‌ణ్ మాత్రం `ముందు డాడీతో సినిమా చేయండి.. మీ కాంబో కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు` అని త్రివిక్ర‌మ్ కి చెప్ప‌డంతో ఈ కాంబో ఇలా సెట్ట‌య్యింది.

ALSO READ: హ‌మ్మ‌య్య‌.. క‌థ లాక్ చేసేశారు