ENGLISH

'క్రాక్' సినిమాకీ గొడ‌వ మొద‌లైంది.

06 February 2021-10:28 AM

`క్రాక్‌` సినిమా విడుద‌ల‌కు ముందు పెద్ద హైటెన్ష‌న్ డ్రామా న‌డిచింది. నిర్మాత మ‌ధుకి ఇది వ‌ర‌కు కొన్ని అప్పులు ఉండ‌డంతో.. వాళ్లంతా.. రిలీజ్‌కి ముందు రోజు ఎగ‌బ‌డ్డారు. సినిమా స‌కాలంలో విడుద‌ల కాకుండా అడ్డుకున్నారు. జ‌న‌వ‌రి 9న మార్నింగ్ షోల‌ను క్రాక్ మిస్ చేసుకుంది. ఎట్ట‌కేల‌కు.. ఫ‌స్ట్ షోల‌తో సినిమా విడుద‌లైంది. హిట్ట‌య్యింది. ఆ గొడ‌వ స‌మ‌సిపోయింది అనుకుంటే.. మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైంది.

 

ఈ సినిమా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనికీ, నిర్మాత మ‌ధుకీ మ‌ధ్య క్లాష్ వ‌చ్చింది. త‌న పారితోషికం లో ఇంకొంచెం పెండింగ్ ఉంద‌ని, అది ఇవ్వాల‌ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ప‌ట్టుప‌డుతున్నాడ‌ట‌. నిర్మాతేమో.. `ఇక ఇచ్చేదం లేదు` అని చేతులెత్తేశాడ‌ట‌. ముందు అనుకున్న‌దాని ప్ర‌కారం ద‌ర్శ‌కుడికి మ‌రో 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ రావ‌ల్సివుంద‌ని, నిర్మాతేమో ఇవ్వ‌న‌ని తేల్చేశాడ‌ని టాక్‌.

 

దీనిపై.. గోపీచంద్ మ‌లినేని కౌన్సిల్ లో ఫిర్యాదు చేశాడ‌ట‌. నిర్మాత మాత్రం `అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ ఖ‌ర్చు పెట్టావు. నీకు పైసా కూడా ఇవ్వ‌ను` అని తేల్చేశాడ‌ట‌. మ‌రి ఈ గొడవ ఏమ‌వుతుందో చూడాలి.

ALSO READ: న‌రేష్‌కి మ‌రో క‌ఠిన ప‌రీక్ష‌