ENGLISH

ఇంకా మొద‌లెట్ట‌లేదు.. అప్పుడే కాపీ ముద్ర‌!

03 September 2021-11:05 AM

శంక‌ర్ కి ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. `భార‌తీయుడు 2` గొడ‌వ‌ల్లో ఉంది. `అప‌రిచితుడు` హిందీ రీమేక్ ప‌రిస్థితీ అంతే. పోనీలే.. ఇవి రెండూ ప‌క్క‌న పెట్టి, రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా చేసేద్దాం అనుకుంటే..దానికీ ఆటంకం ఎదురైంది. ఈ సినిమాపై అప్పుడే కాపీ ముద్ర ప‌డిపోయింది. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు నిర్మాత‌గా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కైరా అద్వాణీని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాపై త‌మిళ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఫిర్యాదు న‌మోదైంది.

 

ఈ క‌థ కాపీ క‌థ అని, ర‌చ‌యిత అనుమ‌తి లేకుండా క‌థ‌ని వాడేస్తున్నార‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ఫిర్యాదు చేయ‌డం విశేషం. సెల్ల‌మ‌త్తు అనే ర‌చ‌యిత కార్తీక్ సుబ్బ‌రాజుకి ఓ క‌థ చెప్పాడు. కార్తీక్‌సుబ్బ‌రాజు నిర్మాత‌గా ఈ సినిమా తెరకెక్కాల్సివుంది. అయితే ఇప్పుడు ఇదే క‌థ‌ని శంక‌ర్ అనుమ‌తులు లేకుండా వాడేస్తున్నాడ‌న్న‌ది ఫిర్యాదు. ఇది వ‌ర‌కు రాబో, శివాజీ సినిమాల‌పై కూడా ఇలానే కాపీ ముద్ర‌లు ప‌డ్డాయి. అప్పుడెలాగో శంక‌ర్ త‌ప్పించుకున్నాడు. మ‌రి ఇప్పుడేం చేస్తాడో చూడాలి.

ALSO READ: డియ‌ర్ మేఘ రివ్యూ & రేటింగ్!