ENGLISH

కరోనా టెన్షన్‌: ఇలాగైతే షూటింగులు కొనసాగేదెలా?

11 November 2020-11:04 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, సినీ పరిశ్రమలో కరోనా కలకలం మాత్రం తగ్గడంలేదు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారని తెలియగానే ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమవుతుందన్న సమయంలో చిరంజీవి కరోనా బారిన పడ్డంతో, షూటింగ్‌ మళ్ళీ వాయిదా పడక తప్పలేదు. ఇలాగైతే ఎలా.? కొన్ని సినిమాలు ఎలాగోలా షూటింగుల్ని పునఃప్రారంభించుకున్నాయి.. వాటిల్లో కొన్ని సజావుగా సాగుతున్నాయి కూడా.

 

కానీ, భయం భయంగా చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు షూటింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆయా సినిమాల ఔట్‌పుట్‌ ఎలా వుంటుందో తెలియని పరిస్థితి. ఓ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌లో గందరగోళం వస్తే, ఆ ఎఫెక్ట్‌ ఇతర సినిమాలకూ పడుతుంది. ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు.. నటీనటులు, టెక్నీషియన్లు మారాల్సి వస్తుంది కదా మరి.! ‘వ్యాక్సిన్‌ వచ్చేవరకు షూటింగ్‌లను ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు..’ అని గతంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అబిప్రాయపడితే, కొందరు ఎద్దేవా చేశారు. కానీ, పరిస్థితులు మారడంతో పవన్‌ కూడా షూటింగ్‌కి హాజరవక తప్పడంలేదు.

 

అయితే, ఆయన చెప్పింది మాత్రం అక్షరసత్యం. మిల్కీ బ్యూటీ తమన్నాకి కరోనా సోకింది.. ఆ సమయంలో ఆమె ప్రాణ భయంతో విలవిల్లాడిందట. ఆరోగ్యవంతురాలైన ఆమెకే అంతటి పరిస్థితి వచ్చిందంటే, ఇతరుల పరిస్థితేంటి.?

ALSO READ: పాపం ‘అఖిల్‌’ హీరోయిన్‌ని ట్రోల్‌ చేస్తున్నారుగా.!