ENGLISH

ద‌స‌రా... ఏ ఏరియాలో? ఎంతెంత‌?

29 March 2023-10:00 AM

నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన చిత్రం.. ద‌స‌రా. నానికి ఇదే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్. త‌న గెట‌ప్‌.. సెట‌ప్ అన్నీ కొత్త‌గా ఉన్నాయి. విడుద‌ల‌కు ముందే.. మంచి క్రేజ్ తెచ్చుకొంది ద‌స‌రా. బ‌డ్జెట్ కి త‌గ్గ‌ట్టే బిజినెస్సూ పూర్తి చేసేసింది. నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో దాదాపే 50 కోట్లు వ‌చ్చిన‌ట్టు టాక్‌. ఇప్పుడు థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా అద‌ర‌గొట్టింది. అన్ని ఏరియాల్లో దాదాపు రూ.48 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టింది. నాని కెరీర్‌లో ఇది మ‌రో రికార్డ్‌.

 

నైజాంలో ఈ సినిమాని రూ.13 కోట్లకు కొన్నారు. సీడెడ్ లో 6.5 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఆంధ్రా నుంచి రూ.15 కోట్లొచ్చాయి. ఓవ‌ర్సీస్ నుంచి 6 కోట్లు, నార్త్ ఇండియా నుంచి 4 కోట్లు రాబ‌ట్ట‌గ‌లిగింది. మొత్తంగా చూస్తే... రూ.48 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ కి రావాలంటే క‌నీసం 55 కోట్లు తెచ్చుకోవాలి. అదే జ‌రిగితే... నాని రేంజ్ పెరిగిన‌ట్టే. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. గురువారం విడుద‌ల కాబోతోంది.