ENGLISH

Deepika: దీపిక అందాల ఆరబోతకు కోత

18 January 2023-13:00 PM

మరో వారంలో షారుక్ ఖాన్ పఠాన్ విడుదల కాబోతోంది. బాలీవుడ్ దీని మీద గంపెడాశలు పెట్టుకుంది. బాలీవుడ్ కి కొన్నాళ్ళుగా సరైన విజయాలు లేవు. సౌత్ సినిమాల హావా అక్కడ నడుస్తోంది. దీంతో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ పఠాన్ పైనే నమ్మకాలు పెట్టుంది. ట్రైలర్ చూస్తే భారీ సినిమానే అనే భరసా ఇచ్చింది. తాజాగా సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి యూ/ఎ సరిఫికేట్ ఇచ్చింది.

 

పఠాన్ కి చాలా సెన్సార్ కట్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్‌’ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్‌ బోర్డు ఈ పాటకు మూడు కట్స్‌ చెప్పింది. దీపిక గోల్డెన్‌ స్విమ్‌సూట్‌లో ఉన్న మూడు క్లోజప్‌ షాట్స్‌, కొన్ని డ్యాన్స్‌ మూమెంట్స్‌ ని లేపేశారు. ఇక సినిమా మొత్తం మీద 10కు పైగా కట్స్‌ చెప్పారని తెలుస్తోంది. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.