ENGLISH

మ‌హేష్‌తో దీపికా ప‌దుకొణె

28 December 2020-10:37 AM

మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. `స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమా రాజ‌మౌళితోనే. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. రాజ‌మౌళి మ‌హేష్ తో సినిమా చేయ‌డానికి ప్రణాళిక‌లు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌హేష్ క‌థ‌పై రాజ‌మౌళి క‌స‌ర‌త్తులు మొద‌లెట్టార‌ని స‌మాచారం. ఈ సినిమాలో కాస్టింగ్ ఎవ‌రైతే బాగుంటారు? అనే విష‌యంపై దాదాపు ఓ అంచ‌నాకు వ‌చ్చేశార్ట‌.

 

హీరోయిన్ గా దీపికా ప‌దుకొణె పేరు ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి దాదాపు యేడాదిపైనే స‌మ‌యం ఉంది. అయినా స‌రే, ముందే కాస్టింగ్ ని ఫిక్స్ చేసేసి, వాళ్ల‌కు అడ్వాన్సులు ఇచ్చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` అవ్వ‌గానే.. ఎలాంటి విరామం లేకుండా మ‌హేష్ సినిమా మొద‌లెట్టాల‌ని చూస్తున్నారు. అందుకే రాజ‌మౌళి ఇంత వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నట్టు స‌మాచారం.

ALSO READ: Deepika Padukone Latest Photoshoot