అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2 ' నుంచి రోజుకొక అప్డేట్ వస్తోంది. డిసెంబర్ 5 న రిలీజ్ కానున్న ఈ మూవీలో ఇంకా రెండు పాటలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో ఒకటి ఐటెం సాంగ్. దీనికోసం శ్రీలీల రంగంలోకి దిగింది. ఇక రెండో పాటని సుకుమార్ షూట్ చేయటం లేదని, వదిలేస్తున్నారని సమాచారం. కారణం టైం లేకపోవటంమే. పైగా ఆ పాట సినిమాలో పెట్టడం వలన రన్ టైం పెరగటం తప్ప పెద్దగా కలిసి వచ్చేది లేదని సుక్కు భావన. పెద్దగా ఉపయోగం లేని పాట కోసం టైం, మనీ రెండు ఎందుకు వేస్ట్ చేయటం అని దాన్ని సినిమాలో చూపించటం లేదని తెలుస్తోంది. అంటే దేవర లో దావూది సాంగ్ లా పుష్ప 2 లో ఒక పాట ఆడియోలో ఉంటుంది, సినిమాలో ఉండదు.
ఏదైతేనేం పుష్ప రాజ్ కి ఐటెం గర్ల్ దొరికింది త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్న టైం లో పుష్ప 2 టీమ్ లో తమన్ చేరటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పుష్ప 1కి దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. పుష్ప 2 కి కూడా సాంగ్స్ అన్నీ అయిపోయాయి. మరిప్పుడు థమన్ ఎందుకు ? అన్న సందేహాలు మొదలయ్యాయి. రెండు పాటలు బయటికి రాగా రెండు సూపర్ హిట్ అయ్యాయి. మొదటినుంచి దేవి శ్రీ, సుకుమార్ ది సక్సెస్ కాంబో. పైగా సినిమా రిలీజ్ కి నెల కూడా లేదు ఈ టైంలో థమన్ ఏం చేస్తాడు అని చర్చ మొదలైంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ ని తీసుకున్నారట. అది కూడా కొన్ని స్పెషల్ సీన్స్ కోసం. థమన్ పాటల్లో కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటంలో దిట్ట. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయ్యింది. పుష్ప 2 పై పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ స్థాయి అంచనాలున్నాయి. అందుకే పుష్ప 2 లో కొన్ని సీన్స్ కి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుందని సుక్కు ఆలోచించారట.
ALSO READ: సందీప్- ప్రభాస్ కాంబో మూవీకి పూరి డైలాగ్స్ !?