ENGLISH

ధడక్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్

21 July 2018-20:25 PM

భారీ అంచనాల నడుమ విడుదలైన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ చిత్రం 'ధడక్‌'. జాన్వీ ఇంట్రడక్షన్‌ మూవీగా విడుదలైన ఈ సినిమాపై అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కూడా అంచనాలున్నాయి. 

తెలుగులో విడుదల కాకపోయినా, సినీ ప్రియులు ఆ అతిలోక సుందరి శ్రీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె వారసురాలు తొలి చిత్రంలో ఎలాంటి నటన కనబరిచిందో తెలుసుకోవాలని ఎదురు చూశారు. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్‌ వస్తాయని చిత్ర యూనిట్‌ ఊహించలేదట. 

కానీ 'ధడక్‌' తొలిరోజు వసూళ్లు రికార్డు బ్రేక్‌ అయ్యాయి. తొలిరోజే 8.71 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఇంతవరకూ కొత్త నటీనటులతో తెరకెక్కి, తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'స్టూడెంట్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌' సినిమా ప్రధమ స్థానంలో ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 'ధడక్‌' బ్రేక్‌ చేసేసింది. ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు ఇద్దరికీ ఇది తొలి సినిమానే. ప్రముఖ హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి వసూళ్లతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. 

మరాఠీ సినిమా 'సైరాత్‌'కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం 'ధడక్‌'. మొత్తానికి అతిలోక సుందరి కూతురు నటనలోనూ, బాక్సాఫీస్‌ స్టామినాలోనూ కూడా తానేంటో తొలి సినిమాతోనే ప్రూవ్‌ చేసేసుకున్నట్లే. శ్రీదేవి జీవించి ఉంటే కూతురి విజయానికి పట్టరాని సంతోషం పొందేది.

ALSO READ: ఈ వారం బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయేదేవరు?