ENGLISH

ధ‌నుష్ రూ.50 కోట్లు అడిగాడా?

22 June 2021-14:44 PM

ఈమ‌ధ్య టాలీవుడ్ లో త‌మిళ క‌థానాయ‌కుల హ‌వా ఎక్కువైంది. వాళ్లంతా తెలుగులో నేరుగా సినిమాలు చేసి, ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకోవాల‌నుకుంటున్నారు. అందులో భాగంగా విజ‌య్ ఓ సినిమాకి ఓకే చెప్పాడు. సూర్య‌కోసంక‌థ‌లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు ధ‌నుష్ కూడా అదే బాట‌లో న‌డుస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల - ధ‌నుష్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంది. `ల‌వ్ స్టోరీ` త‌ర‌వాత‌.. సెట్స్‌పైకి వెళ్లే శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం ఇదే.

 

ఈ సినిమా కోసం ధ‌నుష్ రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. ధ‌నుష్‌కి తెలుగులో అంత మార్కెట్ లేదు. కానీ.. త‌మిళంలో మాత్రం ఆ స్థాయిలో ఉంది. త‌మిళంలో కూడా ఈ సినిమాని మార్కెట్ చేసుకోవాల‌న్న ఉద్దేశంతోనే ధ‌నుష్‌ని ఇందులో హీరోగా తీసుకున్నారు. త‌మిళ వెర్ష‌న్ రూపంలో ఇంచుమించుగా రూ.50 కోట్లు వ‌చ్చేస్తుంది. అందుకే ధ‌నుష్‌కి రూ.50 కోట్లు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది.

ALSO READ: 'మా' అధ్యక్ష పోటీలో మంచు విష్ణు