ENGLISH

దయచేసి మా కుటుంబాన్ని వదిలేయండి: ధనుష్ చెల్లెలు

06 March 2017-17:43 PM

సుచి లీక్స్ పేరిట తమిళ సినీతారల ప్రైవేటు ఫోటోలు అంతర్జాలంలో విడుదలవుతు అందరికి షాక్ ఇస్తున్నాయి.

అయితే ఇవి ప్రముఖ సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుండి బయటకు వస్తుండడంతో ఈ అంశం కోలీవుడ్ ని ఒక ఊపు ఊపుతుందనే చెప్పాలి. ఇలా విడుదల అవుతున్న ఫొటోస్ లో ధనుష్ కూడా ఉండడంతో, ఆయన చెల్లెలు విమల గీత ఈ ఫోటోల లీక్ పై స్పందించింది.

ఇదెవరో కావాలనే  ఇలా తమ కుటుంబం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ఒక వృద్ధ జంట ధనుష్ ని తమ కొడుకు అని చెబుతూ వేసిన కేసుతోనే తమ కుటుంబం మానసికంగా కృంగిపోయింది అని  తెలిపింది. 

అయితే ఇలాంటి తప్పుడు ప్రచారానికి తమ కుటుంబం ఎన్నడు బెదిరిపోదని అలాగే తన అన్నలు (ధనుష్ & సెల్వరాఘవన్) ఎలాంటి వారు అనేది అందరికి తెలుసు అని  స్పష్టంచేశారు. ఇకనైనా తమ పై ఇలాంటి లేనిపోని విషయాలను తమకు ఆపాదించకండి అని విజ్ఞప్తి చేసింది.