ENGLISH

టీజర్: 'దోచేవారెవ‌రురా.. శివ నాగేశ్వరావు రిటర్న్స్

29 July 2022-18:00 PM

మనీ, సిసింద్రీ, ప‌ట్టుకోండి చూద్దాం సినిమాల నాగేశ్వరావు బ్లాక్ కామెడీ సినిమాలు తీయడం తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నారు. అయితే చాలా కాలంగా సినిమాలు దూరంగా వున్న ఆయన మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని 'దోచేవారెవ‌రురా' టైటిల్ తో ఒక సినిమా చేశారు. తాజాగా టీజర్ బయటికి వచ్చింది. ఈ టీజర్ లో ఆయన మార్క్ కనిపించింది.

 

రామ్ గోపాల్ వ‌ర్మ పీఎం అవుతాడు. ప‌ది ల‌క్షలు పందెం కాస్తున్నట్లు మొదలైన టీజర్ శివ నాగేశ్వరావు స్టయిల్ లోనే సాగింది.

 

ఈ కథ రూ.500 నోటు చుట్టూ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. గీత ర‌చయిత చైత‌న్య ప్రసాద్ కుమారుడు ప్రణ‌వ‌ చంద్ర ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నాడు. టీజర్ లో అజ‌య్ గోష్ గెటప్ ఇంట్రస్టింగ్ వుంది. శివ నాగేశ్వరావు కామెడీ, ఆయన సెటైర్ బావుంటుంది. ఇప్పటికీ బద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరు పాట యూత్ కి కనెక్టింగా వుంటుంది. 'దోచేవారెవ‌రురా' టీజర్ చూస్తుంటే ఆయన స్టయిల్ లో కామెడీ ఎంటర్టైనరనిపిస్తుంది. ఆయన స్టయిల్ లో కామెడీ మూవీ వచ్చి చాలా కాలమైయింది. మరి 'దోచేవారెవ‌రురా' ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ALSO READ: 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ రివ్యూ & రేటింగ్‌!