ENGLISH

దిగొచ్చిన దిల్ రాజు.. 33 కోట్ల‌కు బేరం

12 August 2020-15:00 PM

ఎప్పుడో ఉగాదికి విడుద‌ల కావ‌ల్సిన సినిమా `వి`. లాక్ డౌన్ వ‌ల్ల థియేట‌ర్లు మూత‌బ‌డ‌డంతో వాయిదా ప‌డింది. మ‌ధ్య‌లో ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చినా దిల్ రాజు ఒప్పుకోలేదు. `ఎట్టిప‌రిస్థితుల్లోనూ థియేట‌ర్ లోనే మా సినిమాని విడుద‌ల చేస్తాం` అని ప‌ట్టుప‌ట్టి కూర్చున్నారు. అయితే ఎంత‌కీ థియేట‌ర్లు తెర‌చుకునే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ఇప్పుడు దిల్ రాజు దిగి రాక త‌ప్ప‌లేదు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనే విడుద‌ల అవుతోంది.

అమేజాన్ ప్రైమ్ తో దిల్ రాజు బేరం కుదుర్చుకున్న‌ట్టు భోగ‌ట్టా. ఈసినిమాని 33 కోట్ల‌కు అమేజాన్‌కి అమ్మేశార‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌రు 5న ఈ సినిమా అమేజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఇది వ‌ర‌కే అమేజాన్ 35 కోట్ల‌కు ఈ సినిమా కొనాల‌ని చూసింది. అప్పుడు దిల్ రాజు అమ్మ‌లేదు. ఇప్పుడు రెండు కోట్లు త‌క్కువ కోట్ చేసినా ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా న‌టించిన ఈచిత్రానికి ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్లు మొద‌లెట్టే ఆలోచ‌న‌లో ఉంది అమేజాన్‌. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రెండు మూడు రోజుల్లో రావొచ్చు.

ALSO READ: క‌ష్టాల్లో తేజూ సినిమా?