ENGLISH

నిర్మాతగా 'దిల్‌' రాజు 'హీరోయిజం' ఇదీ.!

18 December 2020-18:19 PM

'సినిమా హీరోలకు ఏమాత్రం తగ్గని గ్లామర్‌ మీది.. మీరెందుకు సినిమాల్లో హీరోగా ప్రయత్నించకూడదు.?' అని చాలాసార్లు నిర్మాత దిల్‌ రాజుని చాలామంది ప్రశ్నించారు. 'నాకు ఆ ఆలోచన లేదు. నేను దానికి సూట్‌ అవను కూడా. నేను డిస్ట్రిబ్యూటర్‌ని, నిర్మాతని మాత్రమే. నాకు తెలిసిన పని నేను అత్యంత ఖచ్చితత్వంతో చేయడానికే ఇష్టపడతాను.. ఆ దిశగానే నన్ను మరింత బలోపేతం చేసుకుంటాను..' అని చెబుతూ వచ్చారు దిల్‌ రాజు.

 

అదీ ఆయన ప్రత్యేకత. అయితే, సినిమాల్లో అడపా దడపా తళుక్కున మెరుస్తుంటారు దిల్‌ రాజు. బహుశా అది ఆయా చిత్ర దర్శకుల ఆలోచన కావొచ్చు. ఆ సంగతి పక్కన పెడితే, దిల్‌ రాజు 50వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.. 'దిల్‌' వున్న నిర్మాతకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పటిదాకా ఏ నిర్మాతకీ లేని ఫాలోయింగ్‌ దిల్‌ రాజుకి వుందనడం అతిశయోక్తి కాదేమో. అందుకే, 'దిల్‌ రాజు' పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అనేక హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో వున్నాయి.

 

స్టార్‌ హీరోలకు సంబంధించిన విశేషాలకు మాత్రమే ఈ స్థాయిలో ట్రెండింగ్‌ జరుగుతుంటుంది. 'ఇదీ దిల్‌ రాజు హీరోయిజం' అంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియాని హోరెత్తించేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, విజయ్‌ దేవరకొండ, కన్నడ హీరో యష్‌.. ఇలా ఒకరేమిటి.? చాలామంది స్టార్లు 'దిల్‌' రాజు పుట్టినరోజు వేడుకల్లో హల్‌చల్‌ చేశారు. దిల్‌ రాజు ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక సినిమాల్ని నిర్మిస్తోన్న విషయం విదితమే.

ALSO READ: బాల‌య్య దూకుడే దూకుడు