ENGLISH

దిల్ రాజుకి చిక్కిన క్రేజీ కాంబో

11 February 2021-12:00 PM

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంద‌ని, ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ కీల‌క పాత్ర‌‌ పోషించ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా ఓ వార్త చక్క‌ర్లు కొడుతోంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`.. త‌ర‌వాత చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా కూడా ఇదే అని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. శంక‌ర్ - చ‌ర‌ణ్ కాంబో దాదాపు ఖాయ‌మైపోయింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది లేటెస్ట్ టాక్‌.

 

శంక‌ర్ తో దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఓసారి... ఈ కాంబో సెట్ట‌య్యింది కూడా. కానీ స‌డ‌న్‌గా పక్క‌కు వెళ్లిపోయింది. ఆ క‌మిట్ మెంట్ ప్ర‌కార‌మే.. ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమా దిల్ రాజుచేతికి చిక్కింద‌ని తెలుస్తోంది. శంక‌ర్ సినిమాలంటే భారీ బ‌డ్జెతో ఉండేవే. ఈసినిమాకీ దాదాపు 150 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చవుతుంద‌ట‌. అంటే... దిల్ రాజు బ్యాన‌ర్‌లో రూపుదిద్దుకునే భారీ బ‌డ్జెట్ సినిమా ఇదే అవుతుంది. ప్ర‌స్తుతం `భార‌తీయుడు 2`తో బిజీగా ఉన్నాడు శంక‌ర్‌. ఆ పనుల‌న్నీ అయ్యాక‌... చ‌ర‌ణ్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లెడ‌తాడ‌ట‌.

ALSO READ: గ‌ట్టెక్కేసిన జాంబీ రెడ్డి.. 5 రోజుల్లోనే సేఫ్‌!