ENGLISH

య‌శ్ ని పట్టేసిన దిల్ రాజు.. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

25 May 2022-11:00 AM

టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టారు. బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ చేశారు. అది మంచి ఫ‌లితాల్ని అందివ్వ‌లేదు. ఇప్పుడు `హిట్‌` సినిమాని రీమేక్ చేశారు. త్వ‌ర‌లో విడుదల కాబోతోంది. విజ‌య్ సినిమాతో త‌మిళ‌నాట అడుగుపెట్టారు. ఇప్పుడు క‌న్న‌డ‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించ‌బోతున్నారు. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ య‌శ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. కేజీఎఫ్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు య‌శ్‌. త‌ను ఇప్పుడు స‌రికొత్త పాన్ ఇండియా హీరో.

 

త‌న‌తో సినిమాలు చేయ‌డానికి చాలామంది నిర్మాత‌లు ఉత్సాహం చూపిస్తున్నారు. అంద‌రికంటే ముందుగా దిల్ రాజు క‌ర్చీఫ్ వేసేశాడు. దిల్ రాజుతో ఓ సినిమా చేయ‌డానికి య‌శ్ అంగీకారం తెలిపాడ‌ని స‌మాచారం. కానీ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. తెలుగులో అగ్ర ద‌ర్శ‌కులంతా... దాదాపుగా బిజీ. మ‌రి.. య‌శ్ కోసం.. ఎలాంటి ద‌ర్శ‌కుడ్ని వెదికి పెడ‌తాడో చూడాలి. అన్న‌ట్టు ఈ సినిమా కోసం య‌శ్ కి దాదాపు రూ.100 కోట్ల పారితోషికాన్ని ఆఫ‌ర్ చేశాడ‌ట దిల్ రాజు. త‌మిళ హీరో విజ‌య్‌కీ... వంద కోట్ల పారితోషికం ఇచ్చాడు దిల్ రాజు.

ALSO READ: రామ్ కూడా వంద కోట్ల హీరో అయిపోయాడా?