ENGLISH

డైరెక్టర్‌ గారూ కాస్త ఫైరింగ్‌ తగ్గించాలి మీరూ!

01 May 2019-15:51 PM

అజయ్‌ భూపతి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యు పరమాణువు. 'RX 100' సినిమాని తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు. తొలి సినిమాకే ఊహించని రీతిలో సంచలనం సృష్టించాడీ డెబ్యూ డైరెక్టర్‌. అయితే ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా మరో సినిమాని లైన్‌లో పెట్టలేకపోయాడు. అయితే ఈ మధ్య అజయ్‌ భూపతి పలానా హీరోతో సినిమా చేయబోతున్నాడట అంటూ రూమర్లు స్టార్ట్‌ అయ్యాయి. ఇది చాలా సహజమైన విషయమే. ఓ హిట్‌ కొట్టాక ఆ డైరెక్టర్‌ పేరైనా, హీరో పేరైనా మార్మోగడం, అంచనాలు పెరగడం చాలా రెగ్యులర్‌ అంశమే. అలాగే అజయ్‌ భూపతి విషయంలోనూ జరిగింది.

 

కానీ అజయ్‌ ఈ విషయంలో ఎందుకో కాస్త సీరియస్‌ అయ్యాడు. సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌ని ఖండిస్తూ, కాస్త కటువుగా స్పందించాడు. అజయ్‌ భూపతి ఆటిట్యూడ్‌ని నెటిజన్లు డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. తమదైన శైలిలో కొందరు నెగిటివ్‌గా, మరికొందరు పోజిటివ్‌గా సజిషన్స్‌ ఇస్తూ తమ రెస్పాన్స్‌ తెలియజేశారు. వాటిలో కొన్నింటికి అజయ్‌ మళ్లీ అంతే ఫాస్ట్‌గా అగ్రెసివ్‌గా రెస్పాండ్‌ అయ్యాడు. దాంతో ఆయన ఫ్యాన్స్‌ కొంతమంది రంగంలోకి దూకి, అజయ్‌ దూకుడుని ఖండించే ప్రయత్నం చేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఇగ్నోర్‌ చేయాలి అలా చేస్తేనే ఇండస్ట్రీలో పదికాలాలు చల్లగా ఉండగలవు బాస్‌ అంటూ అజయ్‌ భూపతికి సోపేసే ప్రయత్నం చేశారు. అవును అదీ నిజమే. మరి అజయ్‌ ఈ విషయాన్ని గమనించి, సంయమనం పాఠిస్తాడా? చూడాలిక.

ALSO READ: 'మహర్షి' కోసం 'పెద్దోడూ' - 'కామ్రేడూ'!