ENGLISH

ఆ డైరెక్ట‌ర్‌కి షాక్ ఇచ్చిన చిరు

10 August 2020-16:00 PM

చిత్ర‌సీమ‌లో ఓ ప్రాజెక్టు అనుకోకుండా ద‌క్క‌డం ఎంత స‌హ‌జ‌మో.. అంత‌లోనే చేజారిపోవ‌డం కూడా అంతే స‌హ‌జం. అవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందో, ఎప్పుడు దూరం అవుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. అలాంటి అవ‌కాశమే.. ద‌ర్శ‌కుడు బాబీ చేతికి చిక్కిన‌ట్టే చిక్కి.. తుర్రుమంటోంది.

జైల‌వ‌కుశ‌, వెంకీ మామ సినిమాల‌తో ట్రాక్ లోకి వ‌చ్చాడు బాబీ. వెంట‌నే.. చిరుతో ఓ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు. చిరుతో సినిమా అనే స‌రికి బాబీలోనూ కొత్త ఉత్సాహం వ‌చ్చేసింది. చిరుకి త‌గిన క‌థ రెడీ చేసేశాడు కూడా. `ఆచార్య‌` త‌ర‌వాత ఈ సినిమానే ప‌ట్టాలెక్కాలి. అయితే స‌డ‌న్ గా చిరు ప్లానింగ్ మారింది. బాబీ కంటే ముందుగా.. మెహ‌ర్ ర‌మేష్ సినిమాని మొద‌లెట్టాల‌ని భావిస్తున్నాడ‌ట చిరు. `వేదాళం` రీమేక్‌ని మెహ‌ర్ కి అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. `ఆచార్య‌` త‌ర‌వాత ఈ రీమేకే మొద‌ల‌వుతుంద‌ట‌. బాబీ సినిమా వెన‌క్కి వెళ్లిపోతోంద‌ని తెలుస్తోంది.

అంతేకాదు... వినాయ‌క్ తోనూ చిరు ఓ రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ రెండూ పూర్త‌యితే గానీ, బాబీ సినిమా విష‌యం తేల‌దు. అప్ప‌టి వ‌ర‌కూ బాబీ ఖాళీగా కూర్చోడు క‌దా. మ‌రో హీరోని ప‌ట్టుకుని సినిమా చేయాలి. ఈలోగా ఎన్ని లెక్క‌లు మార‌తాయో....?  మొత్తానికి చిరుతో సినిమా చేద్దామ‌ని ఫిక్స‌యిన బాబీ కి ఇది షాకింగ్ విష‌య‌మే.

ALSO READ: వ‌ర్మ‌.. మ‌రో డేరింగ్ స్టెప్‌