జనసేన స్థాపించిన తరవాత పూర్తిగా రాజకీయాలతో మమేకం అయిపోయాడు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల తరవాత... సినిమాలకు కాస్త స్పేస్ దొరికింది. `ఇక మీదట సినిమాలు చేయను` అన్న పవన్ సైతం - తన నిర్ణయాన్ని మార్చుకుని అభిమానుల కోసం సినిమాలు చేయడం మొదలెట్టాడు. అనూహ్యంగా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ తన జోరు చూపిస్తున్నాడు. వరుసగా సినిమాలు మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. భీమ్లా నాయక్. హరి హర వీరమల్లుతో పాటుగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఒప్పుకున్నాడు పవన్.
ఇప్పుడు మరో దర్శకుడి కథకీ పవన్ ఓకే చెప్పినట్టు సమాచారం. పలాస తో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్. ఇటీవల శ్రీదేవి సోడా సెంటర్ ని తెరకెక్కించాడు. తను పవన్ కోసం ఓ కథ రాసుకున్నాడట. ఇటీవల పవన్ ని కలిసి, లైన్ కూడా చెప్పినట్టు టాక్. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రావొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ కి ఆశించడం కష్టమే. ఎందుకంటే పవన్ ఫుల్ బిజీలో ఉన్నాడు. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడానికే మరో రెండేళ్లు పడుతుంది. అప్పటి వరకూ కరుణ కుమార్ ఆగాలి.
ALSO READ: షాకింగ్: బన్నీకి పోటీ గా చిరు?