ENGLISH

క్రిష్ చేతుల మీదుగా ' ఆకాశ వీధుల్లో' ఫస్ట్ లుక్ విడుదల

24 March 2021-17:54 PM

విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారి చేతుల మీదుగా ఆకాశ వీధుల్లో చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ - ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చిత్రం యొక్క టీజర్ మరియు రెండు పాటలు చూశాను నాకు బాగా నచ్చాయి. టీమ్ అందరికీ అభినందనలు" అన్నారు

 

చిత్ర కథానాయిక పూజిత పొన్నాడ మాట్లాడుతూ - క్రిష్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

 

నూతన నటుడు మరియు దర్శకుడిగా పరిచయం అవుతున్న గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - " ఈ సినిమా నా రెండున్నర ఏళ్ల కృషి,ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసినందుకు క్రిష్ గారికి కృతజ్ఞతలు" అన్నారు.

ALSO READ: వ‌కీల్ సాబ్.. రిక‌వ‌రీ సాధ్యమేనా?