టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు ఆకస్మికంగా మృతి చెందారు. రియల్ స్టార్ శ్రీహరిని ‘పోలీస్’ మూవీతో హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత ‘సాంబయ్య’, ‘శ్రీశైలం’ లాంటి సినిమాలు కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ఈ మూడూ మంచి విజయాల్ని అందుకున్నాయి. శుక్రవారం రాత్రి తన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఫిట్స్ రావడంతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయ్యిందట. కోదాడ వద్దకు రాగానే తుది శ్వాస విడిచారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రముఖ దర్శకుడు, నటుడు వీర శంకర్ తెలియజేశారు. శనివారం ఉదయం నల్లజర్ల దగ్గరలోని కౌలురు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కేఎస్ నాగేశ్వరరావు మృతిపట్ల ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు, స్నేహితులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ALSO READ: శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం