ENGLISH

జపాన్ లో భూకంపం - జక్కన్న ఫ్యామిలీ సేఫ్

21 March 2024-13:33 PM

RRR సినిమా రాజమౌళికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టింది. ప్రపంచం నలుమూలలా జక్కన్న క్రేజ్ పెరిగింది. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా RRR మూవీ రికార్డ్ లు క్రియేట్ చేసింది. ప్రజంట్ జపాన్ లో ఈ మూవీ రీ రిలీజ్ కావటంతో  రాజమౌళి,  ఫ్యామిలీతో కలిసి జపాన్ కి వెళ్లిన సంగతి  తెలిసిందే. జపాన్ లో జక్కన్నకి అపూర్వ ఆదరణ లభించింది. లాస్ట్ టైం ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లగా, అక్కడి ప్రజల ప్రేమాభిమానాలకి ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఇప్పుడు రాజ మౌళికి కూడా అక్కడి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ఒక వైపు RRR సక్సెస్ తో పాటు ఫ్యామిలీ వెకేషన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జక్కన్న. ఈ క్రమంలోనే రాజమౌళి కొడుకు కార్తికేయ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


'ఇప్పుడే జపాన్‌లో భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులో ఉన్నాము. భూమి నెమ్మదిగా కదలడం ప్రారంభించి పై దాకా వచ్చింది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. మేము భయపడ్డాము కానీ జపాన్ వాళ్లంతా అసలు పట్టించుకోలేదు. లైఫ్ లో ఒక్కసారన్నా భూకంపాన్ని ఫీల్ అవ్వాలి అనుకున్నాను, ఆ కోరిక తీరింది అని తన 'X 'ఖాతాలో పోస్ట్ చేసాడు. అంతే కాదు తన స్మార్ట్ ఫోన్ లో భూకంపం అలర్ట్ మెసేజ్ ని కూడా  ఫోటో తీసి షేర్ చేసాడు. 


జపాన్ లో భూకంపాలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అక్కడి వారికి ఇవేమి కొత్త కాదు.  వారి నిత్య జీవితంలో భూకంపాలు కూడా ఒక భాగమయ్యాయి. ఇప్పుడు వచ్చిన భూకంపం చాలా చిన్నది. దీని వలన ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, జక్కన్న ఫామిలీ అంతా సేఫ్ గా ఉన్నారని సమాచారం. లాస్ట్ టైం ఎన్టీఆర్ జపాన్ వెళ్లి తిరిగి ఇండియాకి వచ్చేసరికి జపాన్ లో భారీ భూకంపం వచ్చి, ఆస్తి నష్టం , ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. జస్ట్ మిస్ లేదంటే ఎన్టీఆర్ కి ప్రమాదం సంభవించి ఉండేదని ఫాన్స్ కలవర పడ్డారు. ఇప్పుడు జక్కన్న కూడా సేఫ్ అని ఊపిరి పీల్చుకున్నారు.