ENGLISH

క‌రోనా బారీన ప‌డిన తేజ‌

03 August 2020-17:57 PM

టాలీవుడ్ ని క‌రోనా ప‌ట్టి పీడిస్తోంది. వ‌రుస‌గా టాలీవుడ్ ప్ర‌ముఖులు క‌రోనా బారీన ప‌డుతున్నారు. ఇటీవ‌లే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి క‌రోనా పాజిటీవ్ అని నిర్దార‌ణ అయ్యింది. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు తేజ‌కి కూడా క‌రోనా అని తేలింది. ఓ వెబ్ సిరీస్ ప‌ని నిమిత్తం ముంబై వెళ్లారు తేజ‌. అక్క‌డ ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే పాజిటీవ్ అని నిర్దార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం తేజ కుటుంబ స‌భ్యుల‌కు సైతం క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష ఫ‌లితాలు రావాల్సివుంది.

 

తేజ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయిప్పుడు. గోపీచంద్ తో ఒక‌టి, రానాతో మ‌రోటి సినిమా చేస్తున్నారు. ఈ స్క్రిప్టు ప‌నుల్లో తేజ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు అమేజాన్ కోసం రెండు వెబ్ సిరీస్ లు చేసే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈలోగా క‌రోనా సోకింది.

ALSO READ: వెండితెర‌పై ఆర్తి అగ‌ర్వాల్ క‌థ‌