ENGLISH

లంకలో అందాల రాశి మేటరేంటి?

15 March 2017-11:43 AM

'లంక' సినిమా రాశి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. 'లంక' అనే టైటిల్‌ పెట్టారు. అక్కడేమో ముద్దుగుమ్మ రాశి అందంగా కనిపిస్తోంది. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. తన అంద చందాలతో క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్యే 'కళ్యాణ వైభోగమే' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌ తల్లిగా చిన్న పాత్రలో డల్‌ క్యారెక్టర్‌లో కనిపించింది. గతంలో 'నిజం' సినిమాలో నెగిటివ్‌ పాత్రలో కనిపించింది. గోపీచంద్‌తో కలిసి ఓ ఐటెం సాంగ్‌లో కూడా చిందేసింది.అయితే ఈ సారి మాత్రం రాశి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది ఈ తాజా చిత్రం. రాశి చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందట. శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాలో రాశి క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉండబోతోందట. అయితే రాశిది ఈ సినిమాలో పోజిటివ్‌ రోల్‌నా? నెగిటివ్‌ రోల్‌నా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ కాబట్టి ఈ సినిమాలో రాశిది పోజిటివ్‌ రోలే అంటున్నారు ఓ వైపు. మరో పక్క లంకలో సూర్పునక పాత్రలా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉండబోతోంది రాశి పాత్ర అంటూ టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా రాశి మాత్రం ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో రాశి చీరకట్టులో అందంగా కనిపిస్తోంది. ఈ నిండైన గెటప్‌తో రాశి సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. 

ALSO READ: జయసుధ భర్త అనుమానాస్పద మృతి