ENGLISH

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె`లో మ‌రో హీరోయిన్‌

09 May 2022-10:00 AM

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `ప్రాజెక్ట్ కె`. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ భారీ వ్య‌యంతో తీర్చిదిద్దుతోంది. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ దొరికింది. బాలీవుడ్ నుంచి దిశా ప‌టానీని ఈ సినిమా కోసం దిగుమ‌తి చేస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రాజెక్ట్ కె.. అంటే క‌ల్కి అని అంటున్నారంతా. కానీ చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యంలో ఇంకా స్పందించ‌లేదు.

 

టైమ్ మిష‌న్‌ కి సంబంధించిన క‌థ అంఊట ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై కూడా ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ ని ఫిల్మ్ సిటీలో కొన్ని భారీ సెట్లు తీర్చిదిద్దుతున్నారు. త‌దుప‌రి షెడ్యూల్ ఈ సెట్స్‌లోనే జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా, ప్ర‌భాస్‌ల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఆయ‌న త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తిరిగిస్తాడు. ప్ర‌భాస్ వ‌చ్చాక కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

ALSO READ: స‌మంత కావాల‌నే ఆ డేట్ ఫిక్స్ చేయించిందా?