రామ్ చరణ్ - ఉపాసన తల్లితండ్రులు కాబోతున్నారన్న వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. వీరిద్దరికీ పెళ్లయి పదేళ్లయ్యింది. చరణ్, ఉపాసన ఎప్పుడు కనిపించినా - పిల్లలెప్పుడు? అనే ప్రశ్న ఎదుయ్యేది. వీటికి ఉపాసన ఎప్పుడూ ప్రశాంతంగానే జవాబు చెప్పేది. అయితే కొన్నాళ్ల క్రితం ఇలాంటి ప్రశ్నలపై ఉపాసన సీరియస్ అయ్యింది. ఇప్పుడు... వీరిద్దరి నుంచి తీపి కబురు వినిపించేసరికి.. సమస్య సాల్వ్ అయ్యిందని ఫ్యాన్స్ ఆనందించారు.
ఉపాసనది అద్దెగర్భం (సరోగసీ) అనే మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో గట్టిగా వినిపిస్తోంది. సెలబ్రెటీలు సరోగసీ ని ఆశ్రయించడం కొత్తేం కాదు. ఇది వరకు చాలామంది కథానాయికలు అద్దె గర్భాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఉపాసన కూడా అదే చేసింది. అయితే.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవపరచలేదు. త్వరలో సరోగసీ విషయంలోనూ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ALSO READ: Ram Charan: అన్‌స్టాపబుల్ లో రామ్ చరణ్..