ENGLISH

'వి’ సీక్వెల్‌ కూడా వుంటుందా?

03 September 2020-17:30 PM

విడుదలకు సిద్ధమైన తమ సినిమాల ప్రమోషన్‌ కోసం ‘సీక్వెల్‌ సిద్ధం’ అనే మాట తరచుగా వాడేస్తుంటారు సినీ పరిశ్రమలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు. అలా ఇప్పుడు ‘వి’ సినిమాకి సీక్వెల్‌.. అనే ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ‘వి’ టీమ్ మాత్రం సీక్వెల్‌ గురించి పెదవి విప్పడంలేదు. కానీ, తెరవెనుక మాత్రం ‘వి’ సీక్వెల్‌ రాబోతోందంటూ ప్రచారం చాలా చాలా గట్టిగా సాగుతోంది. ‘వి’ సినిమా ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్ ద్వారా ఓటీటీ రిలీజ్‌ అవుతోన్న విషయం విదితమే.

 

హీరోయిజం, విలనిజం.. ఈ రెండు విషయాల్లోనూ దర్శకుడు చాలా ఇన్నోవేటివ్‌గా ఆలోచించాడనీ, ఈ తరహా సినిమాలు ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై రావడం చాలా అరుదు అనీ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సుధీర్‌బాబు చెబుతున్నాడు. నాని సంగతి సరే సరి. ‘వి’ తన కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఫిలిం అంటున్నాడు. నిజమే, నాని కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఓటీటీ రిలీజ్‌ పరంగానూ ప్రత్యేకమే. అయితే, అది ముందుగా అనుకున్నది కాదు. పరిస్థితులు అలా ఓటీటీ వైపు వెళ్ళేలా చేశాయి.

 

‘25వ సినిమా ప్రత్యేకంగా చేయాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్‌ నా దగ్గరకి దర్శకుడు తీసుకొచ్చారు.. నిజంగానే నేను కోరుకున్నదానికంటే ప్రత్యేకమైన సినిమా ఇది..’ అని నాని చెబుతున్నాడు. సినిమా దీ¸వ్ు చాలా ప్రత్యేకం కావడంతో సీక్వెల్‌ చేస్తే బావుంటుందనే చర్చ ఇప్పుడు దర్శకుడు, నటీనటుల మధ్య జరుగుతోందట. ‘వి’ రిలీజయ్యాకే, ఈ సీక్వెల్‌ ప్రచారంపై స్పందించాలనీ ‘వి’ టీవ్ు భావిస్తోందని సమాచారం.

ALSO READ: 2021లో... చిరు నుంచి రెండొస్తాయా?