ENGLISH

ఇస్మార్ట్‌.. బండి స్టార్ట్‌!

25 March 2024-20:18 PM

పూరి జ‌గ‌న్నాథ్ య‌మ స్పీడు. చెప్పిన స‌మ‌యానికి సినిమా తీసి చూపిస్తాడు. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా స‌రే. అయితే డ‌బుల్ ఇస్మార్ట్‌ విష‌యంలో త‌న లెక్క త‌ప్పింది. ఈనెల‌లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సాధ్యం కాలేదు. మార్చి 8న విడుద‌ల చేస్తామ‌ని చెప్పిన పూరి, అనుకొన్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేయ‌లేక‌పోయాడు. దానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. సినిమా ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ప‌డింద‌ని, ఓటీటీ, డిజిట‌ల్ మార్కెట్లు డ‌ల్ అవ్వ‌డంతో, పెట్టుబ‌డి దొర‌క‌లేద‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా చెప్పుకొన్నారు. కొన్నాళ్లు షూటింగ్ కి బ్రేక్ కూడా ఇవ్వాల్సి వచ్చింది.


అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స‌య్యార‌ని తెలుస్తోంది. ఏపీలో ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు పూరి క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. వ‌చ్చే వారం నుంచి ఇస్మార్ట్ శంక‌ర్‌ చివ‌రి షెడ్యూల్ మొద‌లు కానుంది. ఇందులో భాగంగా కొన్ని పాట‌ల్ని, కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. దాంతో షూటింగ్ పూర్త‌వుతుంది. ఏప్రిల్ చివ‌రి నాటికి ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైపోతుంది. ఆ త‌ర‌వాత ప‌బ్లిసిటీ చేసుకొని, మే చివ‌రి వారం నాటికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కావ్య ధాప‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.