ENGLISH

అవి ఐటెమ్ గీతాలు కావు... డివోష‌నల్ సాంగ్స్‌

17 December 2021-15:00 PM

ఐటెమ్ పాట‌ల‌కు పేటెంట్ హ‌క్కు తీసుకున్న‌వాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌. త‌ను కంపోజ్ చేసిన ప్ర‌తీ ఐటెమ్ పాటా సూప‌ర్ హిట్టు. మ‌రీ ముఖ్యంగా... సుకుమార్ సినిమా అంటే అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉంటుంది. అప్ప‌టి అ.. అంటే అమ‌లాపురం ద‌గ్గ‌ర్నుంచి ఇప్ప‌టి... ఊ అంటావా... ఊహూ అంటావా వ‌ర‌కూ ప్ర‌తీ పాట‌.. బంప‌ర్ హిట్టే. అయితే.. ఇవ‌న్నీ ఐటెమ్ గీతాలు కావ‌ని, ఇవ‌న్నీ డివోష‌న‌ల్ సాంగ్స్ అని కొత్త అర్థం ఇచ్చాడు దేవిశ్రీ ప్ర‌సాద్.

 

త‌న‌ని అంద‌రూ `ఐటెమ్ రాజా`లా చూస్తార‌ని, కానీ త‌ను ప్ర‌తీ పాట‌నీ ఒకేలా ప్రేమిస్తాన‌ని, ఐటెమ్ గీతాల్లో లిరిక్స్ మార్చి.... భక్తి గీతాలుగా కూడా పాడుకోవ‌చ్చ‌ని, అలా అవి డివోష‌న‌ల్ సాంగ్స్ కూడా అయిపోతాయ‌ని వెరైటీ గా మాట్లాడాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌. అంతేకాదు... ఊ అంటావా, ఊహూ అంటావా పాట ట్యూన్ ని ప‌ట్టుకుని క్లాసిక‌ల్ సింగ‌ర్ అయిన శోభారాజ్ ఓ భ‌క్తిగీతంలా మార్చారని దేవిశ్రీ అన్నాడు. శోభారాజ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆవిడ ఆ పాట‌ని భ‌క్తి గీతంగా మార్చిన వైనం బాగా న‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌. అంటే... దేవిశ్రీ నుంచి ఎప్పుడు ఐటెమ్ గీతం వ‌చ్చినా.. దాన్ని డివోష‌న‌ల్ సాంగ్ లానే వినాల‌న్న‌మాట‌.

ALSO READ: 'పుష్ప' మూవీ రివ్యూ & రేటింగ్