ENGLISH

Sita Ramam: సీతారామం సీక్వెల్‌కు సల్మాన్ బ్రేకులు

17 September 2022-11:00 AM

చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని అందుకొంది సీతారామం. దుల్క‌ర్ స‌ల్మాన్‌కు తెలుగులో ఇది పెద్ద విజ‌యం. హ‌ను రాఘ‌వ‌పూడిపై ఈ సినిమా మ‌రింత న‌మ్మ‌కాన్ని పెంచితే... వైజ‌యంతీ మూవీస్ గౌర‌వాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఉంటుంద‌ని అందులో దుల్క‌ర్ మ‌ళ్లీ న‌టిస్తాడ‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

 

వాటికి స‌డ‌న్ బ్రేకులు వేశాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ``సీతారామం ఓ క్లాసిక్‌. అది మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంటుంద‌ని నాకు ముందే తెలుసు. అనుకొన్న‌దానికంటే గొప్ప ఫ‌లిత‌మే వ‌చ్చింది. అయితే ఇలాంటి క‌థ‌ల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ తీయ‌లేం. `సీతారామం` ఓ మ్యాజిక్‌. అది ఒక‌సారే కుదురుతుంది. ఈ సినిమాకి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ తీసే ఆలోచ‌న మా టీమ్‌లో ఒక్క‌రికి కూడా లేదు.

 

ఒక వేళ చేస్తాన‌న్నా అందులో నేను న‌టించ‌ను`` అని క్లారిటీగా చెప్పేశాడు దుల్క‌ర్‌. సో... సీతారామం సీక్వెల్ వ‌స్తుంద‌న్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేద‌ని తేలిపోయింది. మ‌రోవైపు.. హ‌ను రాఘ‌వ‌పూడి మ‌రో కొత్త క‌థ రాసుకోవ‌డంలో నిమ‌గ్న‌మైపోయాడు.ఈసారి త‌ను మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఇది కూడా పిరియాడిక‌ల్ డ్రామా అని టాక్‌. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ రివ్యూ & రేటింగ్!