ENGLISH

ఇంద్రగంటి కోసం ఈషా రెబ్బా.!

27 April 2019-14:30 PM

విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించిన 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తొలి సినిమాకే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. స్టార్‌ ఇమేజ్‌ సంపాదించకపోయినా, వరుస ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఇటీవల 'అరవింద సమేత' సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది. 'బ్రాండ్‌ బాబు', 'సుబ్రహ్మణ్యపురం' తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి మార్కులేయించుకుంది. 

 

ఇక్కడ గమనించాల్సిందేమంటే, హీరోయిన్‌గా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి సినిమాల్లోనే ఎక్కువగా నటించింది ఈషారెబ్బ. తొలి సినిమా మినహా, తర్వాత వచ్చిన 'బంధిపోటు', 'అమీతుమీ' చిత్రాల్లో ఈషా నటించింది. ఇంద్రగంటి తాజా సినిమా నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్లు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఇంద్రగంటి, ఈషారెబ్బని తీసుకున్నాడనీ తెలుస్తోంది. 

 

ఈషా టాలెంట్‌ సంగతి ఇంద్రగంటికి బాగా తెలుసు. అందుకే కథని మలుపు తిప్పే ఓ కీలక పాత్ర కోసం ఈషాని సంప్రదించాడట. ఇంద్రగంటి అడిగితే ఈషా కాదనకుండా ఉంటుందా.? నిడివితో సంబంధం లేకుండానే ఒప్పేసుకుందట. నిడివి తక్కువే అయినా, ఈ పాత్ర ఈషాకి మరోసారి మంచి పేరు తీసుకొస్తుందనీ అంటున్నారు. చూడాలి మరి. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ సినిమాల పైనా ఈషా దృష్టి పెట్టింది. ఆల్రెడీ తమిళంలో ఓ సినిమాలో నటించిన ఈషా త్వరలోనే కన్నడలోనూ సత్తా చాటనుంది.

ALSO READ: 'ఆర్ఆర్ఆర్‌'కి ఆమె ఫిక్సయ్యిందా.?