ENGLISH

5వ రోజూ... అదే జోరు!

01 June 2022-12:29 PM

బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎఫ్ 3 హంగామా కొన‌సాగుతోంది. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్లు అందుకొన్న ఎఫ్ 3.. సోమ‌వారం కూడా స్ట‌డీగానే ఉంది. మంగ‌ళ‌వారం కూడా అదే జోరు కొన‌సాగించింది. 5 వ‌రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిపి రూ.3.17 కోట్లు ఆర్జించింది. దాంతో.. టోట‌ల్ గ్రాస్ 35.28 కోట్ల‌కు చేరింది. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే రూ.5 కోట్ల మార్క్ చేరుకొంది. రెస్టాఫ్ ఇండియాలో దాదాపు 2 కోట్ల వ‌ర‌కూ అందుకొంది. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి దాదాపు 70 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగింది. ఎక్కువ ఏరియాల్లో దిల్ రాజునే సొంతంగా విడుద‌ల చేసుకొన్నారు. బ్రేక్ ఈవెన్ రావాలంటే.. క‌నీసం మ‌రో 20 కోట్ల‌యినా సాధించాల్సి ఉంటుంది. ఈవారం విక్ర‌మ్‌, మేజ‌ర్ చిత్రాలు విడుద‌ల అవుతున్నాయి.

 

రెండు సినిమాల‌పైనా మంచి బ‌జ్ ఉంది. మ‌రి ఈ చిత్రాల ధాటిని త‌ట్టుకొని... ఎఫ్ 3 ఏమాత్రం నిల‌బ‌డుతుందో చూడాలి. ఈ వీకెండ్ కూడా ఎఫ్ 3 జోరు కొన‌సాగితే.. బ‌య్య‌ర్లు లాభాల బాట‌లో ప‌య‌నించ‌డం ఖాయం. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లు. పూజా హెగ్డే ఓ మాస్ పాట‌లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.

ALSO READ: కె.కె జ్ఞాప‌కాల‌లో త‌డిసిముద్ద‌వుతున్న సంగీత ప్రియులు