ENGLISH

ఎఫ్ 3లో న‌లుగురు హీరోయిన్లా?

26 March 2021-12:00 PM

2019లో వ‌చ్చిన ఎఫ్ 2.. సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో నిర్మించిన చిత్రాల్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపుదిద్దుకుంటుంది. ఎఫ్ 3లో ని వెంక‌టేష్ - త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ - మెహ‌రీన్ జంట‌లే.. ఇందులోనూ కనిపించ‌నున్నాయి. అయితే వీళ్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లూ క‌నిపించ‌బోతున్నార్ట‌. ఓ ఐటెమ్ గీతంలో ర‌ష్మిక న‌టించ‌బోతోంద‌ని టాక్‌.

 

త‌న సినిమాలోని ప్ర‌తీ హీరోయిన్ తోనూ.. త‌దుప‌రి సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయించ‌డం.... అనిల్ రావిపూడికి అల‌వాటుగా వ‌స్తోంది. దాన్నే.. ఎఫ్ 3లోనూ కొన‌సాగిస్తే, స‌రిలేరు నీకెవ్వ‌రులో క‌థానాయిక‌గా న‌టించిన‌, ర‌ష్మిక‌ని ఐటెమ్ గాళ్ గా చేయాలి. అయితే...ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ని సైతం ఓ పాత్రకు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. `పండ‌గ చేస్కో` `లెజెండ్‌`,`రూల‌ర్‌` చిత్రాల‌లో క‌థానాయిక‌గా న‌టించింది సోనాల్.

 

ఈ సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో సోనాల్ సైడ్ అయిపోయింది. ఇంత‌కాలానికి మ‌ళ్లీ టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అయితే ఈ పాత్ర కూడా క‌థానాయిక కాదు. గెస్ట్ రోల్ లాంటిది మాత్ర‌మే.

ALSO READ: 'అర‌ణ్య' మూవీ రివ్యూ & రేటింగ్!