ENGLISH

అంద‌రికీ గ‌ట్టి షాక్ ఇచ్చిన పుష్ష‌

21 March 2021-11:16 AM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. పుష్ష‌. ర‌ష్మిక మంధాన కథానాయిక‌. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో విల‌న్‌గా ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో పేర్లొచ్చాయి. విజ‌య్‌సేతుప‌తి, బాబి సింహా, ఆర్య‌.. ఇలా ప్ర‌ముఖుల పేర్లు వినిపించాయి. కానీ సుకుమార్‌.. అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేసేశాడు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని న‌టుడి పేరుని అనౌన్స్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

 

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ చిత్రంలో విల‌న్ పాత్ర పోషిస్తున్న‌ట్టు అనౌన్స్ చేశారు. ‌జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం అందుకున్నాడు ఫాజిల్‌. మ‌ల‌యాళంలో ఇప్పుడు క్రేజీ స్టార్‌. విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు త‌న‌ని తెలుగు సీమ‌కు తీసుకొచ్చాడు.. సుక్కు. . ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేర‌ళ‌, మారేడు మిల్లి, రంప‌చోడ‌వ‌రంలోని అట‌వీ ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. ఇప్పుడు తెన్‌కాశీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: అఖిల్ సినిమాకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. నాగ్ ఏమంటాడో?