ENGLISH

ఆదిపురుష్ సెట్లో అగ్ని ప్ర‌మాదం

02 February 2021-21:09 PM

ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా... ఆదిపురుష్‌. ఈ రోజే ముంబైలోని ఓ స్టూడియోలో క్లాప్ కొట్టారు. అయితే... తొలి రోజే అప‌శృతి దొర్లింది. ఆదిపురుష్ సెట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల సంభ‌వించిన ఈ అగ్ని ప్ర‌మాదంలో... సెట్లోని బ్లూ మాట్స్ అన్నీ కాలి బూడిద‌య్యాయి. అంత‌కు మించిన ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

 

అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో.. ఎవ‌రికీ ఏమీ కాలేదు. సెట్లో ఉన్న‌వాళ్లంతా సేఫ్‌. అగ్ని ప్ర‌మాద స‌మ‌యంలో ఆద పురుష్ సెట్లో దాదాపు 150 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడితో పాటు.. ప్ర‌ధాన సాంకేతి వ‌ర్గ‌మంతా సెట్లోనే ఉంది. అయితే.. ఎవ‌రికీ ఏం కాలేదు. ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. తొలి రోజు ఆంజ‌నేయుడి పాత్ర‌ధారిపై కొన్ని షాట్లు తెర‌కెక్కించారు.

ALSO READ: బాల‌య్య‌.. బోయ‌పాటి.. రైట్స్ హాట్ కేక్‌!