ENGLISH

కేజీఎఫ్ థియేట‌ర్లో తుపాకీ కాల్పులు

21 April 2022-10:10 AM

కేజీఎఫ్ ఆడుతున్న ఓ థియేట‌ర్లో ప్రేక్ష‌కుడు వీరంగం సృష్టించాడు. తుపాకీతో హ‌ల్ చ‌ల్ చేశాడు. అంతేకాదు. కేజీఎఫ్ చూస్తున్న ఊపులో గాల్లో కాల్పులు కూడా జ‌రిపాడు. దాంతో ఓ వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే..

 

ఇటీవ‌ల కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క‌ర్నాట‌క‌లోని శిగ్గావిలోని రాజ‌శ్రీ థియేట‌ర్లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆ థియేట‌ర్లోకి ఓ అగంత‌కుడు వ‌చ్చాడు. సినిమా చూస్తూ... చూస్తూ వీరావేశంతో.. జేబులోంచి తుపాకీ తీసి మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. అందులోంచి ఓ బుల్లెట్.. వ‌సంత‌కుమార్ అనే ఓ ప్రేక్ష‌కుడి కాల్లోకి దూసుకుపోయింది. దాంతో అరుపులు కేక‌లు మిన్నంటాయి. గాయ‌ప‌డిన ప్రేక్ష‌కుడ్ని థియేట‌ర్ యాజ‌మాన్యం ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అయితే కాల్పులు చేసింది ఎవ‌రన్న‌ది తెలియ‌లేదు. ఎవ‌రైనా, సినిమా చూస్తున్న అత్యుత్సాహంతో కాల్పులు జ‌రిపారా, లేదంటే... వ‌సంత కుమార్ కి శ‌త్రువులు ఎవ‌రైనా ఉన్నారా? అనే కోణం నుంచి పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఏదైమైనా థియేట‌ర్లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం మాత్రం కొత్త భ‌యాల‌ను రేకెత్తిస్తోంది.

ALSO READ: ‘అంటే సుందరానికీ’ .. గెస్ చేయండి చూద్దాం