ENGLISH

క‌త్తి మ‌హేష్‌ కోసం విరాళాల సేక‌ర‌ణ‌

29 June 2021-15:26 PM

న‌టుడు, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు మ‌హేష్ కి మరో కీల‌క‌మైన ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌బోతోంది. మ‌హేష్ శ‌స్త్ర చికిత్స‌, వైద్యం, ఆసుప‌త్రి ఖ‌ర్చులు... ఇవ‌న్నీ భారీగా అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దాంతో.. దాతలు కూడా ముందుకు వ‌స్తున్నారు. చాలామంది సినీ ప్ర‌ముఖులు, క‌త్తి మ‌హేష్ స‌న్నిహితులు ధ‌న స‌హాయం చేయ‌డానికి ముందుకొచ్చినా మ‌హేష్ కుటుంబ స‌భ్యులు నిరాక‌రించారు.

 

హెల్త్ ఇన్సూరెన్స్ స‌దుపాయం ఉండ‌డం వ‌ల్ల‌... ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే... రాబోయే రోజుల్లో క‌త్తిమ‌హేష్ మ‌రికొంత కాలం ఆసుప‌త్రిలోనే ఉండాల్సి రావొచ్చు. కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్టొచ్చు. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని, క‌త్తిమ‌హేష్ కోసం విరాళాలు సేక‌రించాల‌ని స‌న్నిహితులు భావిస్తున్నారు. ఓ ట్ర‌స్ట్ ద్వారా ఈ విరాళాల్ని సేక‌రించాల‌ని, వ‌చ్చిన మొత్తాన్ని క్ర‌మ‌బ‌ద్ధంగా ఖ‌ర్చు పెట్టి, ప్ర‌తీ పైసాకి లెక్క చూపించాల‌ని, ఆ బాధ్య‌త ఓ సినీ ప్ర‌ముఖుడికి అప్ప‌గించాల‌ని చూస్తున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఎకౌంట్ నంబ‌ర్ తో స‌హా, సంబంధిత వివ‌రాలు క‌త్తి మ‌హేష్ స‌న్నిహితులు ప్ర‌క‌టిస్తారు.

ALSO READ: తెలుగులో త‌గ్గింది... హిందీలో కుమ్మేస్తోంది