ENGLISH

సుశాంత్ కేసులో మ‌రో అరెస్టు

19 October 2020-10:20 AM

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసు చ‌క్క‌ర్లు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో మరో అరెస్టు జ‌రిగింది.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్‌సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఈ కేసులో రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, పర్సనల్‌ స్టాఫ్‌ దీపేశ్‌సావంత్‌ తదితరులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

రియా కి ఇటీవ‌లే బెయిల్ దొరికింది. దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌ లాంటి ప్రముఖుల్ని కూడా ఎన్‌సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని అరెస్టులు జ‌ర‌గొచ్చ‌ని బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి..

ALSO READ: 'మ‌హాస‌ముద్రం'లో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌.