ENGLISH

కాజ‌ల్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌... అదిరింది!

23 November 2020-18:32 PM

కాజ‌ల్ పెళ్ల‌యిపోయింది. ప్ర‌స్తుతం హ‌నీమూన్ మూడ్ లో ఉంది. అయితే.. త‌న ప్రేమ గురించి రోజుకో కొత్త క‌బురు వివ‌రిస్తూ.. అభిమానుల‌కు కావ‌ల్సినంత కాల‌క్షేపం అందిస్తోంది కాజ‌ల్. లేటెస్టుగా త‌న గౌత‌మ్ త‌న‌కు ల‌వ్ ఎలా ప్ర‌పోజ్ చేశాడో... చెప్పుకుంటూ మురిసిపోయింది. సినిమాల్లో చూస్తుంటాం క‌దా..? అబ్బాయి చేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని, మెకాళ్ల ముందు కూర్చుని `ఐ ల‌వ్ యూ` చెబుతాడు. అచ్చం కాజ‌ల్ నీ అలానే ప్ర‌పోజ్ చేశాడ‌ట గౌత‌మ్‌.

 

''అందరి అమ్మాయిల్లానే.. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకునేదాన్ని. ముఖ్యంగా నాకు కాబోయే వాడు… మోకాళ్ల పై నిలబడి ఎర్రని గులాబి ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చెయ్యాలని కోరుకుకునేదాన్ని.! సరిగ్గా నేను కోరుకున్నట్టే… గౌతమ్ నాకు ప్రపోజ్ చేశాడు'' అంటూ ఆ రొమాంటిక్ ఘ‌డియ‌ల గురించి చెప్పుకొచ్చింది. ఒక‌వేళ‌.. గౌత‌మ్ ఇలా ప్ర‌పోజ్ చేయ‌కపోతే.. అస‌లు పెళ్లే చేసుకునేదాన్ని కాదు.. అంటూ న‌వ్వేస్తోంది కాజ‌ల్‌. త్వ‌ర‌లోనే హ‌నీమూన్ ముగించుకుని, సినిమా షూటింగుల‌తో బిజీ కానుంది. తొలుత `ఆచార్య‌` షూటింగ్‌లోనే కాజ‌ల్ పాల్గొంటుంద‌ని, ఆ త‌ర‌వాత‌.. `ఇండియాన్ 2` సెట్లో కాజ‌ల్ అడుగుపెడుతుంద‌ని స‌మాచారం.

ALSO READ: బిగ్‌హౌస్‌లో మోనాల్‌ యాత్ర ఎప్పటిదాకా?