ENGLISH

Gopichand: మరో కథ ఓకే చేసిన గోపీచంద్

27 February 2023-10:00 AM

గోపీచంద్ ప్ర‌స్తుతం `రామ‌బాణం' సంధించ‌డంలో బిజీగా ఉన్నాడు. ఆ త‌రువాతి సినిమా కూడా ఖాయ‌మైంది. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌తో ఆయ‌న ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. హ‌ర్ష ఇటీవ‌ల శివ‌రాజ్ కుమార్‌తో 'వేద‌' అనే చిత్రాన్ని రూపొందించారు. క‌న్న‌డ‌లో ఇది పెద్ద హిట్.

తెలుగులో కూడా అదే పేరుతో డ‌బ్ అయ్యింది.అయితే జ‌నాద‌ర‌ణ కరువైంది. కానీ క‌న్న‌డ‌లో వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ తో.. గోపీచంద్ హ‌ర్ష‌తో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. మార్చి 3న ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదో పూర్తి స్థాయి యాక్ష‌న్ డ్రామా. గోపీచంద్‌కి అలాంటి క‌థ‌లు బాగా సూట‌వుతాయి. అందుకే... ఈ క‌థ‌ని వెంట‌నే ప‌ట్టాలెక్కించేశాడు గోపీచంద్‌. రాధామోహ‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.