ENGLISH

గోపీచంద్‌కి 'ఆక్సిజన్‌' లభించేనా?

29 August 2017-12:54 PM

ఆరడుగుల బుల్లెట్‌ గోపీచంద్‌కి స్టార్‌డమ్‌ వచ్చినట్లే వచ్చి, వెనక్కి వెళ్లిపోతోంది. సక్సెస్‌ వచ్చినప్పుడు రేస్‌లోకి రాకెట్‌లా దూసుకొచ్చేస్తున్నాడు గోపీచంద్‌. కానీ ఆ తర్వాత మళ్లీ వెనకబడిపోతున్నాడు. ప్రతీసారి గోపీచంద్‌కి ఇదే అలవాటుగా మారిపోయింది. సక్సెస్‌ని కొనసాగించలేకపోతున్నాడు. 'జిల్‌', లౌక్యం' సినిమాలు గోపీచంద్‌కి మంచి సక్సెస్‌ని తెచ్చిపెట్టాయి. అదే సక్సెస్‌ మూడ్‌లో రెండు ప్రెస్టీజియస్‌ సినిమాలు సెట్స్‌ పైకి వెళ్లాయి. వాటిల్లో ఒకటి 'గౌతమ్‌ నందా', రెండోది 'ఆక్సిజన్‌'. ఈ జోరులోనే ఈ సినిమాలు అనుకున్న టైంకి రిలీజయ్యి ఉంటే గోపీచంద్‌ సక్సెస్‌ జోరు కొనసాగేదేమో కానీ, అలా జరగలేదు. రకరకాల కారణాలతో ఆ సినిమాలు విడుదల ఆలస్యమయ్యింది. ఎట్టకేలకు 'గౌతమ్‌నందా' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన గోపీచంద్‌కి నిరాశే మిగిలింది. ఇక మిగిలిన 'ఆక్సిజన్‌' మీదే గోపీచంద్‌ ఆశలన్నీ. గోపీచంద్‌కి అప్పుడున్న మార్కెట్‌ వేల్యూతో 'గౌతమ్‌నంద' సినిమాకి భారీ బడ్జెట్‌ వెచ్చించారు. కానీ బడ్జెట్‌కి తగ్గట్లుగా ఆ సినిమా వసూళ్లని సాధించడంలో ఫెయిల్యూర్‌ చవి చూసింది. దాంతో 'ఆక్సిజన్‌' సినిమాని లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే తెరకెక్కించారు. అయినప్పటికీ ఈ సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. ఎ.ఎమ్‌. కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆశక్తికరమైన కథా, కథనాలతో 'ఆక్సిజన్‌' తెరకెక్కించారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రిపోర్ట్స్‌ కూడా బాగున్నాయి ఈ సినిమాకి. అక్టోబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ALSO READ: మహేష్ కత్తికి బండ్ల గణేష్ వార్నింగ్