ENGLISH

OTT లకు షాకిచ్చిన కేంద్రం

14 March 2024-16:44 PM

ప్రజంట్ అన్ని భాషల్లోనూ OTT ల హావా కొనసాగుతోంది. ప్రాంతీయ భాషా బేధాలు లేకుండా అన్ని సినిమాల్ని, సిరీస్ లని ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారు. OTT ల కున్న ఆదరణ కారణంగా కొత్త సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకని టైం లో ఈ ప్లాట్ ఫామ్ లే మంచి అవకాశంగా మారాయి. ఇక్కడ ఎలాంటి కంటెంట్ అయినా, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా స్ట్రీమింగ్ చేయటం కూడా వీటికి కారణం.  కొంత మంది  OTT ప్లాట్ ఫామ్స్ కి కూడా కొన్ని హద్దులు ఉండాలని, కొన్ని హింస, అడల్ట్ కంటెంట్ కి హద్దులుండాలని ఈ మధ్య ఎక్కువ విమర్శలు వస్తున్నాయి.


 ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై  కొరడా ఝలిపించి నిషేధం విధించింది.  అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందు వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి సంబంధించిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు పేర్కొంది . ఈ నిషేధం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక సార్లు నోటీసులిచ్చినా, వారు బేఖాతరు చేయటంతో  ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ , 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కు  మార్చి 12నే నిషేధంపై ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  కేంద్రం తీసుకున్న ఈ  నిర్ణయంతో  ఓటీటీ లకి గడ్డుకాలం మొదలయ్యింది అనే చెప్పాలి. ఇక నుంచి కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి, ఏది పడితే అది స్ట్రీమింగ్ చేయటానికి లేదనే చెప్పాలి.