ENGLISH

ట్రైలర్ తోనే మహేష్ ఆల్ టైం రికార్డ్

09 January 2024-11:59 AM

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' మూవీపై  చాలా అంచనాలున్నాయి. ఈ మూవీ ట్రైలర్ తో క్రేజ్ ఇంకొంచెం పెరిగింది. సినిమా రిలీజ్ కి ముందే కేవలం ట్రైలర్ తోనే  ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. ఈ  ట్రైలర్ జనవరి 7 రిలీజ్ అయింది. మహేశ్ మాస్ లుక్, ఊర మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు అత్యధిక  వ్యూస్ వచ్చాయి.  ఈ విషయాన్ని మూవీ టీమ్ స్వయంగా వెల్లడించింది.


గుంటూరు కారం సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.  'సలార్' ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. దీంతో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా ఈ మూవీ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడించింది. “ఈడు రౌడీ రమణ… సినిమా స్కోపు.. ఈ సంక్రాంతికి 70ఎంఎంలో బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆల్‍టైమ్ రికార్డ్. గుంటూరు కారం ట్రైలర్‌కు వ్యూస్ 39 మిలియన్స్ దాటేశాయి. 24 గంటల్లో మోస్ట్ వ్యూవ్డ్ సౌత్ ఇండియన్ ట్రైలర్” అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.


జనవరి 12 ఈ మూవీ ప్రేక్షకులముందుకు రానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.