ENGLISH

హరీష్‌ శంకర్‌ కసిగా కొట్టేస్తాడట

11 March 2017-18:38 PM

హరీష్‌ శంకర్‌ కెరీర్‌లో 'గబ్బర్‌ సింగ్‌'తో సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన 'రామయ్యా వస్తావయ్య'తో చతికిలబడ్డాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో తెరకెక్కించిన 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు హరీష్‌ శంకర్‌. అయితే 'గబ్బర్‌ సింగ్‌' స్థాయి విజయాన్ని మళ్లీ అందుకోవాలని ఆశిస్తున్నాడట హరీష్‌ శంకర్‌. అందుకే తాజా చిత్రం అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తోన్న 'డీజె' విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ సంచలనాల్ని క్రియేట్‌ చేస్తోంది. అలాగే బన్నీ, యాక్షన్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది ఈ సినిమా. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. బన్నీ ట్రాక్‌ రికార్డు కూడా చాలా బాగుంది ఇప్పుడు. వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నాడు. 'రేసుగుర్రం', సరైనోడు' సినిమాలు బిగ్గెస్ట్‌ హిట్స్‌నిచ్చాయి బన్నీకి. అదే రేంజ్‌లో ఈ సినిమా కూడా బన్నీకి మంచి సక్సెస్‌నిస్తుందంటున్నారు. మరో పక్క హరీష్‌ శంకర్‌ కూడా తన స్టామినాకి తగ్గ సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. కథా, కథనాలు బలంగా ఉండడంతో పాటు, రాకింగ్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి మరో బలమైన ఆకర్షణ కానుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ALSO READ: 'లీక్‌'పై మండిపడ్డ సెక్స్‌బాంబ్‌