ENGLISH

హెబ్బా... ఇలా అయ్యిందేంట‌బ్బా..?

29 March 2021-12:01 PM

ఒక్క‌సారి కెర‌టంలా విరుచుకుప‌డిపోయిన తార‌... హెబ్బా ప‌టేల్‌. `కుమారి 21 ఎఫ్‌`తో త‌న పేరు మార్మోగిపోయింది. చేతినిండా అవ‌కాశాలొచ్చాయి. అన్నీ గ్లామ‌ర్ పాత్ర‌లే. కాక‌పోతే.. స‌రైన సినిమా ప‌డ‌లేదు. త‌న‌కు స‌రిప‌డ‌ని పాత్ర‌లు చేసి, చేతులు కాల్చుకుంది. మ‌ధ్య‌లో కొన్ని త‌ప్పులు కూడా చేసింది. ఓ యువ హీరోతో క్లోజ్ గా తిరిగింద‌ని, వాళ్ల మ‌ధ్య సంబంధాలు బెడ‌సి కొట్టాయ‌ని, ఆ ప్ర‌భావం కెరీర్ పైనా ప‌డింద‌ని చెప్పుకున్నారు.

 

అయితే ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. `రెడ్` సినిమాలో ఓ ఐటెమ్ గీతంలో హాట్ హాట్ గా క‌నిపించింది హెబ్బా. ఆ సినిమా హిట్ట‌యినా.. హెబ్బాకి రావాల్సిన పేరు రాలేదు. క‌నీసం ఐటెమ్ గీతాల‌కైనా పిలుస్తార‌నుకుంటే... అక్క‌డా నిరాశే ఎదురైంది. ఇప్పుడేం చేస్తే.. తెలుగు ద‌ర్శ‌కుల దృష్టిలో ప‌డ‌తానా..? అని తీవ్రంగా ఆలోచిస్తోంద‌ట హెబ్బా. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు ట‌చ్‌లో వెళ్తుంద‌ని, త‌న‌క్లోజ్ ఫ్రెండ్స్ స‌హాయంతో కొత్త అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంద‌ని టాక్‌.

ALSO READ: వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ కోసం... థియేట‌ర్లు రెడీ!