ENGLISH

‘హాట్‌ గులాబీ’ గట్టిగానే డిమాండ్‌ చేస్తోందట.!

27 September 2020-12:37 PM

నల్ల గులాబీ.. అదేనండీ ‘బ్లాక్‌ రోజ్‌’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోన్న బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే, టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఊర్వశి రౌతెలా, అక్కడ కొన్ని స్పెషల్‌ సాంగ్స్‌ కూడా చేసేసింది. దాంతో, ఆమె క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు నిర్మాతలు టాలీవుడ్‌లోనూ పోటీ పడుతున్నారట.

తాజాగా ఓ యంగ్‌ హీరోతో సినిమా నిర్మిస్తోన్న ఓ నిర్మాణ సంస్థ, ఊర్వశి రౌతెలాని స్పెషల్‌ సాంగ్‌ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, ఊర్వశి మాత్రం ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసేసరికి, షాకయ్యిందట ఆ నిర్మాణ సంస్థ. ‘మా సినిమాలో హీరోయిన్‌కి కూడా ఆ స్థాయిలో రెమ్యునరేషన్‌ ఇవ్వడంలేదు’ అంటూ సదరు నిర్మాణ సంస్థ గుస్సా అవుతోందట. తప్పదు మరి.. ఒక్కోసారి, తమ సినిమా రేంజ్‌ పెంచుకోవడానికి స్పెషల్‌ సాంగ్స్‌ కోసం ఎక్కువే ఖర్చు చేయాల్సి వుంటుందన్నది ‘కమర్షియల్‌’ సూత్రం.

మరోపక్క, తెలుగు సినిమాల్లో ఇకపై తనకు మరిన్ని ఛాన్సులు వస్తాయనే ఆశాభావంతో వుంది ఊర్వశి రౌతెలా. బాలీవుడ్‌తో పోల్చితే, తెలుగులో సినిమాల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందని అప్పుడే టాలీవుడ్‌ మీద ప్రశంసలు కురిపించేస్తోంది. ఊర్వశి చెబుతోందని కాదుగానీ.. బాలీవుడ్‌తో పోల్చితే, టాలీవుడ్‌లో సినిమాల నిర్మాణ వేగం చాలా చాలా ఎక్కువే.

ALSO READ: కొర‌టాల శివ క‌థ‌ల‌నే కొట్టేశారు!